బడంగ్‌పేట, డిసెంబర్12 : దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట దావూద్‌ఖాన్ గూడలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆదివారం 76 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను అందజేశారు. స్థానిక కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ బడంగ్‌పేటలో దివ్యాంగుల భవనం ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు రావలసిన రాయితీలు వచ్చే విధంగా చొరవ తీసుకుంటానని చెప్పారు. డిగ్రీ చదువుకునే దివ్యాంగులు ఉంటే మోటర్ సైకిల్, ల్యాప్ టాప్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి 107 మందికి గత సంవత్సరం మోటర్ సైకిల్ అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, సీడీపీవో సక్కుబాయి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, ముత్యాల లలిత కృష్ణ, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, బీమిడి స్వప్న జంగారెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్‌రెడ్డి, రామిడి మాధురి వీరకర్ణారెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, రాళ్లగూడెం సంతోష్ శ్రీనివాస్‌రెడ్డి, యాతం పవన్ యాదవ్, ఏనుగు రాంరెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ర్రెడ్డి,గౌర రమాదేవి శ్రీనివాస్, దివ్యాంగుల అధికారి శేలజ, టీఆర్ఎస్ బడంగ్‌పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, వికలాంగుల నాయకులు మహేశ్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.