శామీర్పేట, డిసెంబర్ 13: రైతుల కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రైతులకు సూచించారు. సోమవారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం పోతారం గ్రామ పర్యటనకు వెళ్లిన మంత్రి.. ఓ రైతుకు సంబంధించిన చేనులో తానే స్వయంగా క్యాప్సికమ్ విత్తనాలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న తీరు రైతాంగాన్ని చిక్కుల్లో పడేసేలా ఉన్నదని అన్నారు. వరిని సాగు చేసి నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని చైతన్యవంతులను చేస్తున్నదని చెప్పారు.