మేడ్చల్, డిసెంబర్ 23 : అభివృద్ధిలో మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నిర్మించిన బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్న్లలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని పేర్కొన్నారు. నూతన కాలనీలకు ప్రణాళిక బద్ధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు దేవరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, గణేశ్, మహేశ్, కో ఆప్షన్ సభ్యులు నవీన్‌రెడ్డి, గీత, మహమూద్ అలీ, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి విష్ణుచారి, మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ జడ్పీటీసీ శైలజ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్‌యాదవ్, నాయకులు రవీందర్‌రెడ్డి, మధుకర్, నర్సింహా రెడ్డి, మల్లికార్జున్ స్వామి సందీప్‌గౌడ్, రవీందర్ పాల్గొన్నారు.
ఆలయాల అభ్యున్నతికి కమిటీ సభ్యులు కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లోని దాక్షాయని రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణాస్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై కమిటీ చైర్మన్ కాశీనాథ్, సభ్యులు శ్యాంరావు, బాలమల్లేశ్, రాజశేఖర్‌రెడ్డి, శారదతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మేడ్చల్‌లో ప్రసిద్ధి గాంచిన అతి పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయమని, అన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఎండోమెంట్లో చేర్చి రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్ పరిధిలో అభివృద్ధి చేస్తున్న మినీ స్టేడియాన్ని మంత్రి గురువారం పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
nఇటీవల మృతి చెందిన మేడ్చల్ మున్సిపల్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి దశదిన కర్మకు మంత్రి మల్లారెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసానిచ్చారు.