ఘట్కేసర్, డిసెంబర్ 22: మహిళలు నైపుణ్యాలు పెంచుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 119లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఐటీఐ భవన నిర్మాణానికి చైర్పర్సన్ ఎం.పావనీజంగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళలకు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందిస్తే అన్ని రంగాల్లో ఎదగడం ఖాయమన్నారు. ఈ మహిళా ఐటీఐ నిర్మాణానికి హెచ్ఏఎల్ కంపెనీ సీఎస్ఆర్ ఫండ్ కింద రూ.7 కోట్లు వెచ్చిస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శాంసన్, హెచ్ఏఎల్ జీఎంలు అరున్జనార్దన సర్కాటే, చంద్రకాంత్, హెచ్ఆర్ చీఫ్ మేనేజర్ జితేందర్‌పాల్ కౌర్, డీజీఎం సీఎస్ సురేందర్‌జీ, హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ ప్రహ్లాద,డీజీఎం టీఎస్ సోమశేఖర్, ఘట్కేసర్ తాసీల్దార్ విజయలక్ష్మి, కమిషనర్ వసంత, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, రైతు సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ హేమలతాగోపాల్రెడ్డి పాల్గొన్నారు.