జవహర్‌నగర్, డిసెంబర్ 21 : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం కార్పొరేషన్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఆర్డీవో రవీందర్ అధ్యక్షతన క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ క్రైస్తవులు సంతోషంగా పండుగ చేసుకోవాలనే ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తుందన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మరిన్ని నిధులు కేటాయించి కార్పొరేషన్‌ను మోడల్‌గా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌గుప్తా, అదనపు కలెక్టర్ శ్యాంసన్, కాప్రా తహసీల్దార్ అనిత, కార్పొటర్లు, కోఆప్షన్మెంబర్లు, కార్పొరేషన్ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.