జవహర్‌నగర్, డిసెంబర్ 21: ప్రజల సహకారంతో జవహర్‌నగర్ కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం 5వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేశ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్పొరేషన్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని కోరారు. అంబేద్కర్‌నగర్‌లోని మసీద్ బస్తీలో నీటి ఎద్దడి లేకుండా ప్రజల సౌకర్యార్థం కోసం నీటి ట్యాంకులను ప్రారంభించారు. అంబేద్కర్‌నగర్‌లోని శ్మశానవాటిక అభివృద్ధి కోసం మంత్రి సొంతంగా రూ.లక్ష ఇచ్చారు. అనంతరం కార్పొరేషన్ పరిధి…అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన చెగువేరా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌గుప్తా, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.