శామీర్‌పేట, డిసెంబర్ 12 : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన ఎస్.రమేశ్ అనారోగ్య నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.15,500, సుధాకర్‌కు రూ.40 వేల చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి జగదీశ్‌గౌడ్, తూంకుంట మాజీ సర్పంచ్ నాగేశ్‌యాదవ్, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, లబ్ధిదారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తూంకుంట మున్సిపాలిటీలోని అయ్యప్ప స్వామి ఆలయంలో 5వ వార్డు కౌన్సిలర్ రాజ్కుమార్యాదవ్ ఆదివారం సత్యం గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డితో పాటు టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్‌రావు , మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, కౌన్సిలర్లు, అయ్యప్ప స్వాములు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడ్చల్ రూరల్ : మండల పరిధిలోని రావల్కోల్ గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ దుందిగళ్ల ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డి తండ్రి ప్రతాప్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆయన దశదిన కర్మ సందర్భంగా మంత్రి పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, సర్పంచ్ మహేందర్ , టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు హరత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.