జవహర్‌నగర్, డిసెంబర్ 10 : పేదింటి యువతులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కాప్రా తాసీల్దార్ అనీత అధ్యక్షతన 56 మంది లబ్ధిదారులకు జవహర్‌నగర్ కార్పొరేషన్లో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌గుప్తా, కమిషనర్ జ్యోతిరెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పేదింటి యువతుల కోసం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్‌కు అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని, పట్టణ రూపురేఖలు మారిపోతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీవాణి శ్రీనివాస్‌రెడ్డి, శారద మనోధర్‌రెడ్డి, వేణు, శ్రీనివాస్, నాగరాణి , లక్ష్మి కృష్ణగౌడ్, నిహారిక, శ్రీనివాస్‌రెడ్డి, లలితాయాదవ్, లావణ్య సతీశ్‌గౌడ్, ఆశాకుమారి, రవి, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగన్న బాల్‌రాజ్, యువజన విభాగం నాయకుడు భార్గవ్‌రామ్, జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప, రాజశేఖర్, పార్టీ నాయకులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆడబిడ్డల పెండ్లి చేయాలంటే గతంలో ఎంతో ఇబ్బంది పడేవారని, నేడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కార్యకర్తలు పని చేయాలని కోరారు.
మేడ్చల్ కలెక్టరేట్ : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.