
బయ్యారం నవంబర్ 22: ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు.. నేనున్నానంటూ అభయమిచ్చి మానవత్వాన్ని చూపించే మంత్రి కేటీఆర్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకొన్నారు. మహబుబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన ఉపేందర్-తిరుపతమ్మ ఈ నెల 19న విద్యుత్తు షాక్‌తో మృతిచెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు శ్యామల (11), బిందు (10) అనాథలయ్యారు. చిన్నారుల పరిస్థితిపై తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ పత్రిక కథనాలను కొందరు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. చలించిన మంత్రి కేటీఆర్.. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంకకు సూచించారు. అడిషనల్ కలెక్టర్‌తోపాటు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ టీం అధికారులు పిల్లలకు తక్షణ సాయం అందించారని, వారి సంరక్షణ బాధ్యత పెద్దనాన్న కుటుంబానికి అప్పగించామని కలెక్టర్.. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.