మంత్రి జూపల్లికి నిరసన సెగ
మంత్రి జూపల్లికి విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో శనివారం అధికారులతో మంత్రి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.
- కోడేరు సమీక్షలో ఎస్ఎఫ్ఐ నేతల ప్లకార్డుల ప్రదర్శన
- విద్యార్థుల సమస్యలపై ఏమాత్రం స్పందించని మంత్రి
కోడేరు, నవంబర్ 7 : మంత్రి జూపల్లికి విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో శనివారం అధికారులతో మంత్రి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ప్లకార్డులు ధరించి నిరసన తెలియజేశారు. బీసీ హాస్టల్‌కు భవనం నిర్మించడంతోపాటు బీసీ బాలికల గురుకుల భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న ఉన్నత పాఠశాల, కేజీబీవీ భవనాలను త్వరగా పూర్తి చేయాలని, అక్రమ డిప్యుటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను తిరిగి వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సమస్యలపై పలుమార్లు ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టింపు కరువైందని, మంత్రి జూపల్లికి స్వయంగా పలు సందర్భాల్లో విన్నవించినా స్పందన లేదని చెప్పారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పలు సమస్యలపై విద్యార్థులు గళమెత్తినా మంత్రి జూపల్లి నుంచి స్పందన కరువైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

