తొలగించిన ఓటర్లకు మరో చాన్స్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుదకని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.
- ఏఎస్‌డీడీ జాబితాలోని 73.39 లక్షల మందికి బీఎల్వోల ద్వారా సమాచారం
- ఇంటింటికీ వెళ్లి ఫామ్‌లు ఇవ్వనున్న అధికారులు
- ఇప్పటికే 6 లక్షల మంది ఫామ్ -6 సమర్పణ
- మరో 2 లక్షల ఫామ్‌లు వస్తాయని అంచనా
నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణహైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుదకని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. గైర్హాజరు (ఆబ్సెంట్), వలస వెళ్లిన (షిఫ్టెడ్), మరణించిన (డెడ్), ఒకటి కంటే ఎకువచోట్ల పేర్లున్న(డూబ్లికేట్) విభాగాల్లో గుర్తించిన ఓటర్లను తుది జాబితాలో చేర్చేందుకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) మరోసారి రంగంలోకి దిగుతున్నారు.
ఈ క్యాటగిరీల్లో ఉన్నవారికి ఇంటింటికీ వెళ్లి కొత్త ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందించడంతోపాటు ఫోన్ ద్వారా సంప్రదించనున్నారు. ఇప్పటికే 6 లక్షల మంది ఫామ్ -6 ద్వారా దరఖాస్తు చేసుకోగా, మరో 2 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు.
వీరిలో 2,64,87,213 మంది ఎన్యుమరేషన్ ఫామ్‌లను సమర్పించారు. మిగిలిన 73,39,235 మంది ఫామ్‌లు సమర్పించకపోవడంతో వారిని ఏఎస్‌డీడీ క్యాటగిరీ కింద గుర్తించారు. గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, ఒకటి కంటే ఎకువ చోట్ల ఓటు నమోదు చేసుకున్నవారు ఉన్నారు. వీరిలో అర్హులైనవారికి తుది ఓటర్ల జాబితాలో చోటు కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పోలింగ్ కేంద్రాల వద్ద జాబితాల ప్రదర్శన
ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్నవారి వివరాలను పోలింగ్‌బూత్‌లవారీగా సిద్ధం చేసి సంబంధిత పోలింగ్ కేంద్రాలు, నియమిత ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. పేర్లు ముసాయిదా జాబితాలో ఎందుకు చేరలేదో కారణాలతో సహా ఈ జాబితాలను అందుబాటులో ఉంచుతారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్ https://ceotelangana.nic. in లోనూ అప్లోడ్ చేయనున్నారు.
తద్వారా ఓటర్లు తమ పేర్లు ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏఎస్‌డీడీ క్యాటగిరీలో గుర్తించినవారు మాత్రమే ఈ ప్రత్యేక అవకాశం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం స్పష్టం చేశారు. బీఎల్వోలు ఓటర్ల మొబైల్ నంబర్లకు ఫోన్ చేయడంతోపాటు, అవసరమైనచోట్ల ఇండ్లకువెళ్లి ఫామ్‌లు అందజేస్తారని వివరించారు.
చిరునామా మారినవారు వివరాలు ఇవ్వాలి
గతంలో నివాసం మారకపోయిన, ఎన్యుమరేషన్ఫామ్ సమర్పించలేకపోయినవారు తాజా గా ఫామ్ పూర్తి చేసి, గతంలో ఎందుకు సమర్పించలేకపోయారో వివరణ జతచేయాలి. నివాసం మార్చుకున్నవారు చిరునామా మార్పు కోసం ప్రత్యేకంగా ఫామ్-8 సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే కొత్త ఎన్యుమరేషన్ ఫామ్‌తోపాటు ప్రస్తుత చిరునామా, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు, చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణతోపాటు వాటి పరిషార ప్రక్రియ నవంబర్ 26తో ముగియనున్నది. అనంతరం పరిశీలన పూర్తి చేసి ఈ నెల 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

