వీసీ జానయ్యను విధుల నుంచి తొలగించాలి
ఉన్నత విద్యాసంస్థలో మహిళా ప్రొఫెసర్కే రక్షణ లేని పరిస్థితి ఏర్పడటంతో యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. 8 నెలలుగా వేధింపులకు గురవుతున్న బాధితురాలికి బాసటగా తోటి ప్రొఫెసర్లు, విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థి సంఘాలు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట భారీఎత్తున ఆందోళనకు దిగారు
-
వర్సిటీ ప్రాంగణంలో నిరసన
వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 7: ఉన్నత విద్యాసంస్థలో మహిళా ప్రొఫెసర్కే రక్షణ లేని పరిస్థితి ఏర్పడటంతో యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. 8 నెలలుగా వేధింపులకు గురవుతున్న బాధితురాలికి బాసటగా తోటి ప్రొఫెసర్లు, విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థి సంఘాలు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట భారీఎత్తున ఆందోళనకు దిగారు. పవిత్రమైన విద్యాపీఠంపై అత్యున్నత పదవిలో ఉంటూ మహిళా అధ్యాపకురాలిని వేధించిన వీసీ అల్దాస్ జానయ్యను తక్షణమే పదవి నుంచి తప్పించాలని, ఆయనపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రాంగణాన్ని నినాదాలతో హోరెత్తించారు.
టాసా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చల్లా సౌజన్య మాట్లాడుతూ కొందరు ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తమకు వత్తాసు పలికేవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులైనా విచారణ జరుపకపోవడంలో అంతర్యమేందని ప్రశ్నించారు. ఆమెకు న్యాయం జరిగేవరకు నిరంతరం నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. టాసా అధ్యక్షుడు పవన్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకుడు అమృత్రెడ్డి తదితరులు నిరసనలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

