హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన పట్టాలను ఆయా కుల సంఘాల పేరుతోనే జారీ చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 21, 22 తేదీల్లో ఆయా సంఘాలకు పట్టాలు అందజేస్తారని చెప్పారు. సోమవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బీసీ కులాలకు చెందిన రిజిస్టర్డ్ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడు తూ.. ఆత్మగౌరవ భవనాలకు పట్టాలు పొందేందుకు వీలు గా ఆయా కులసంఘాలు ఈ నెల 17లోగా ఏక సంఘం గా రిజిస్టరై, ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.
నేడు పలు కుల సంఘాలతో భేటీ
ఐదు సెషన్లుగా నిర్వహించిన సమావేశాల్లో తొలి సెషన్లో 37 సంచార జాతులకు చెందిన ఎంబీసీ కులాల ప్రతినిధులతో చర్చించారు. 2వ సెషన్లో వాల్మీకిబోయ, కుమ్మర శాలివాహన, మేదరి, వడ్డెర, విశ్వబ్రాహ్మణ, పూ సల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 3వ సెషన్లో నకాషీ, మేర, జాండ్రా, నీలి, దేవాంగ, ఆరే, ల క్కమర్రికాపు సంఘాల ప్రతినిధులు, 4వ సెషన్లో బొం దిలి, కచ్చి, లోదా, భూజ్వా, పట్కారీ, అగర్వాల్సమాజ్, తెలంగాణ మరాఠా, 5వ సెషన్లో నాయీ బ్రాహ్మణ, రజ క, ఎల్లాపు, ఛాత్తాద శ్రీవైష్ణవ, గంగపుత్ర తదితర కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. మంగళవారం ఇతర కుల సం ఘాల నేతలతో భేటీ కొనసాగనున్నది. కుల సంఘాల నేతల సందేహాలకు బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బు ర్రా వెంకటేశం వివరణ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే రాజాసింగ్, బీసీ సంక్షేమశాఖ అధికారులు అలోక్‌కుమార్, సైదా, బాలాచారి, సంధ్య, విమల పాల్గొన్నారు.
41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు
రాజకీయాలకు అతీతంగా బీసీలు ఏకసంఘంగా ఏర్పడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మం త్రి గంగుల పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో రూ.5,500 కోట్ల విలువైన 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మంచి ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ సంక్షేమానికి గొప్ప కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే బీసీలకు మంచిరోజులొచ్చాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం పెంచే విధంగా అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.