పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. వీటితో చేసిన ఉగ్గు, జావ పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయి. చిరు ధాన్యాలతో బ్రెడ్, స్నాక్స్ కూడా తయారు చేస్తున్నారు. ఈ గింజల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలం. ఫైబర్, క్యాల్షియం, ఐరన్ అపారం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరువేల రకాల చిరుధాన్యాలు పండుతున్నాయి. ఇవన్నీ ‘గ్లూటెన్ రహితం’ కావడంతో వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు.
మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in