మిల్కా సింగ్ కు కరోనా పాజిటివ్
మిల్కా సింగ్‌కు కరోనా పాజిటివ్ | లెజెండ్ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన మిల్కా సింగ్ బుధవారం కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఆయన చండీగఢ్ సెక్టార్ 8లోని నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

న్యూఢిల్లీ : లెజెండ్ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన మిల్కా సింగ్ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఆయన చండీగఢ్ సెక్టార్ 8లోని నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ తెలిపారు. గత రాత్రి నుంచి 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇంట్లోని సహాయకుల్లో ఒకరు పాజిటివ్‌గా పరీక్షించారని, ఈ మేరకు పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయస్సు 91 ఏళ్లు కావడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆయనను చూసుకోవడానికి ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు ఓ సహాయకుడిని నియమించింది. ఆయన కుమార్తె మోనా మిల్కా సింగ్ న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ హాస్పిటల్లో వైద్యురాలు కావడంతో ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తుందని నిర్మల్ కౌర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిల్కా సింగ్ మాట్లాడుతూ ‘నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. బుధవారం జాగింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాజిటివ్‌గా పరీక్షించినందుకు ఆశ్చర్యపోయాను. నేను పూర్తిగా బాగున్నాను’ అని పేర్కొన్నారు.
మిల్కా సింగ్ కుమారుడు, గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ కొవిడ్‌పై పోరాడేందుకు రూ.2లక్షలు విరాళంగా అందజేశారు. ‘ది ఫ్లయింగ్ సిక్కు’గా పేరొందిన మిల్కా సింగ్ ఒలింపిక్ పతకం సాధించలేకపోయినప్పటికీ.. తన కెరీర్లో మరపురాని పోటీల్లో పాల్గొన్నారు. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 400 మీటర్ల రేస్ అందరికీ గుర్తుండి పోతుంది. పోటీల్లో నాల్గో స్థానంలో నిలిచినా.. ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లో బంగారు పతకం సాధించిన ఏకైక అథ్లెట్ నిలిచారు.
ఇవి కూడా చదవండి..
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..?
ఇక ఇంట్లోనే కొవిడ్ టెస్టు!.. ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ ఆమోదం..
కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం పహాడియా కన్నుమూత
ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్‌కు చెక్
రష్యాలో టీకా పర్యాటకం
సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్
దేశంలో 24గంటల్లో 2.76లక్షల కేసులు.. 3,874 మరణాలు
ఢిల్లీలో 70 ఏళ్ల తర్వాత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
కరోనాతో జామియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతి
టీకాల వృథాను ఆపాలి : అధికారులతో ప్రధాని మోదీ
సెర్టాయిడ్స్ తక్కువగా తీసుకోవాలి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

