పాల ధరల పెంపుతో స్వీట్ల ధరలకు రెక్కలు
దేశవ్యాప్తంగా పాల ధరలు భారీగా పెరగడంతో ఈ దీపావళి స్వీట్లు ప్రియమయ్యాయి. గత ఏడాది కాలంలో డెయిరీ సంస్థలు పాల ధరలను 17 శాతం వరకు పెంచాయి. ఫలితంగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్ వంటి ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా పండుగల సమయంలో స్వీట్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వాటి ధరలు 15 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. పాల ధరల పెరుగుదలకు ఐస్‌క్రీమ్ తయారీ సంస్థల ముందస్తు నిల్వలు కూడా ఒక కారణంగా మారాయి.
- ఏడాది వ్యవధిలో 17% పెరుగుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాల ధరలు భారీగా పెరగడంతో ఈ దీపావళి స్వీట్లు ప్రియమయ్యాయి. గత ఏడాది కాలంలో డెయిరీ సంస్థలు పాల ధరలను 17 శాతం వరకు పెంచాయి. ఫలితంగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్ వంటి ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా పండుగల సమయంలో స్వీట్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వాటి ధరలు 15 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. పాల ధరల పెరుగుదలకు ఐస్‌క్రీమ్ తయారీ సంస్థల ముందస్తు నిల్వలు కూడా ఒక కారణంగా మారాయి. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమయ్యాయి. పశువుల దాణాకు ఉపయోగించే మక్కజొన్న ఆధారిత పశువుల మేత ధరలు 75 శాతం పెరిగాయి. ఈ భారాన్ని డెయిరీ సంస్థలు వినియోగదారులపై మోపుతున్నాయి. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా 25 శాతం ఉన్నప్పటికీ, ఉత్పత్తి వ్యయాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాల ధరల పెంపుతో స్వీట్ల ధరలకు రెక్కలు
క్యాన్సర్ మందుల తగ్గిన ధరలు అమల్లోకి
దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

