చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ సందడి మొదలైంది. ఫ్రాంఛైజీలన్నీ రాబోయే సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాయి. సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడబోతున్న ముంబై ఇండియన్స్ తాజాగా ఆటగాళ్ల ఫొటోషూట్ నిర్వహించింది. ముంబై ప్లేయర్లు ఇషాన్ కిషన్, క్రిస్‌లిన్‌తో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా షూట్లో పాల్గొన్నాడు.
ప్రస్తుతం ట్రైనింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకున్న రోహిత్ సేన ఫన్ ఫొటోషూట్‌కు హాజరైంది. కెమెరాకు పోజిస్తుండగా తీసిన ఫొటోలను ముంబై ట్విటర్లో షేర్ చేసింది. స్టన్నింగ్ లుక్‌లో అర్జున్ ఉన్న అర్జున్ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అర్జున్‌కు ఇదే మొదటి ఐపీఎల్ సీజన్ కావడం విశేషం. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అర్జున్ను ముంబై రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.
Don’t they look fa’Blue’lous 😍💙
— Mumbai Indians (@mipaltan) March 29, 2021
📸 from our photoshoot at the @RenaissanceMum 🙌#OneFamily #MumbaiIndians #IPL2021 @ishankishan51 @lynny50 @MarriottBonvoy pic.twitter.com/rnFlzGcMGz