హైదరాబాద్ : ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో(Metro train) కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె నేపథ్యంలో మెట్రో సర్వీసులు పెంచుతున్నట్లు ప్రకటించింది.
మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో సాధారణంగా పీక్ అవర్స్‌లో 3 నిమిషాల 40 సెకలన్లకు ఒక రైలు, నాన్ పీక్‌లో 4 నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు నుడుపుతుంటారు. నాగోల్-రాయదుర్గ్ కారిడార్‌లో నాన్ పీక్‌లో 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు ఉండగా ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు ఉండనుంది. అలాగే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులు పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు.