Meta | ఎన్నికల వేళ రాజకీయ నేతలకు మెటా షాక్.. ఆ కంటెంట్‌ను రికమెండ్ చేయబోమని ప్రకటన
Meta | సాధారణ ఎన్నికల వేళ రాజకీయ నేతలకు సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) షాకిచ్చింది. తమ ఇన్స్టాగ్రామ్ (Instagram), థ్రెడ్స్ (Threads) ప్లాట్‌ఫామ్స్‌లో ఇకపై పొలిటికల్ కంటెంట్‌ను రికమెండ్ చేయబోమని ప్రకటించింది. అంతేగాక ఫేస్బుక్లో కూడా త్వరలో అవాంఛిత పొలిటికల్ కంటెంట్‌కి కళ్లెం వేస్తామని చెబుతోంది.
Meta | సాధారణ ఎన్నికల వేళ రాజకీయ నేతలకు సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) షాకిచ్చింది. తమ ఇన్స్టాగ్రామ్ (Instagram), థ్రెడ్స్ (Threads) ప్లాట్‌ఫామ్స్‌లో ఇకపై పొలిటికల్ కంటెంట్‌ను రికమెండ్ చేయబోమని ప్రకటించింది. అంతేగాక ఫేస్బుక్లో కూడా త్వరలో అవాంఛిత పొలిటికల్ కంటెంట్‌కి కళ్లెం వేస్తామని చెబుతోంది.
కాగా, ఫేస్బుక్, ఇన్‌స్టా, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్ కంటెంట్‌ను రికమెండ్ చేయబోమని ప్రకటిచింది.
అయితే రాజకీయ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది. అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించే వారికి తాము ఏ మాత్రం అడ్డు రాబోమని స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి కావాలని తాము కోరుకుంటున్నాని, అందుకే ఫాలోకాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్‌ను ముందస్తుగా సిఫార్సు చేయబోమని చెప్పింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా హెడ్ ఆడమ్ మోస్సేరి కూడా థ్రెడ్స్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం రాజకీయ నాయకులకు సోషల్ మీడియా బలమైన వేదికగా ఉంది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే అనువుగా మారింది. ఈ విషయంలో ఫేస్బుక్, ఇన్‌స్టా ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కానీ, మెటా తాజా నిర్ణయంతో ఆయా ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్ కంటెంట్ అందిరికీ చేరదు. పొలిటికల్ అకౌంట్లు, పేజీలను ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్ చేరుతుంది. ఎన్నికల వేళ మెటా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు షాకే అని చెప్పవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

