Lionel Messi : ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) మళ్లీ మైదానంలోకి దిగాడు. తండ్రి జార్జ్ మెస్సీ హఠాన్మరణంతో స్వల్ప కాలికంగా ఆటకు విరామం ఇచ్చిన మెస్సీ.. కీలక గోల్‌తో ఇంటర్ మియామి(Inter Miamai)ని ఆదుకున్నాడు. కన్నతండ్రిని కోల్పోయిన బాధ నుంచి తేరుకుంటున్న అతడు మేజర్ సాకర్ లీగ్ (MSL) టోర్నీలో గోల్ చేసిన అనంతరం భావోద్వేగానికి లోనయ్యాడు. నాన్నకు అంకితం చేశాడు.
మేజర్ సాకర్ లీగ్‌లో గురువారం ఇంటర్ మియామి, ఫిలడెల్ఫియా యూనియన్ మ్యాచ్‌లో మెస్సీ తన మ్యాజిక్ చూపించాడు. తండ్రి జార్జ్ మెస్సీ మరణాంతరం మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన అతడు.. ఈ మ్యాచ్‌లో గోల్‌తో ఆక్టటుకున్నాడు. 21వ నిమిషంలో ఇంటర్ మియామి తొలి గోల్ చేయడం సాయపడిన మెస్సీ.. కాసేపటికే సూపర్ కిక్‌తో బంతిని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, మెస్సీ టీమ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
Leo Messi scores his first league goal since returning from the World Cup 💫
(via @MLS)pic.twitter.com/SfnShlOnCR
— B/R Football (@brfootball) August 20, 2026
12 అడుగుల వలయం లోపల నుంచి గోల్ కొట్టిన సాకర్ లెజెండ్ ఎప్పటిలా సంబురాలు చేసుకోలేదు. తన దివంగత తండ్రిని యాది చేసుకొని.. ‘ఇది నీకు అంకితం’ అన్నట్టుగా చేతులు పైకి చూపిస్తూ ఆకాశంకేసి చూశాడీ వెటరన్. కీలకమైన గోల్ చేసిన మెస్సీని సహచరులు అభినందించారు. అయితే.. ఫిలడెల్ఫియా ఓ గోల్ చేయడంతో 2-2తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
𝗟𝗲𝗼 𝗠𝗲𝘀𝘀𝗶 𝗹𝗼𝗼𝗸𝗲𝗱 𝘁𝗼 𝘁𝗵𝗲 𝘀𝗸𝘆 𝗮𝗳𝘁𝗲𝗿 𝘀𝗰𝗼𝗿𝗶𝗻𝗴 𝗵𝗶𝘀 𝗳𝗶𝗿𝘀𝘁 𝗴𝗼𝗮𝗹 𝘀𝗶𝗻𝗰𝗲 𝗵𝗶𝘀 𝗳𝗮𝘁𝗵𝗲𝗿’𝘀 𝗱𝗲𝗮𝘁𝗵 ❤️
Messi sent a left-footed shot into the net to give Miami a 2-1 lead. The game eventually ended in a 2-2 draw against… pic.twitter.com/j9Um3iNCBG
— Sportstar (@sportstarweb) August 20, 2026