పారిస్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ, జమైకా స్ప్రింటర్ షెల్లి ఆన్ ఫ్రేజర్ ప్రైస్ ఆయా విభాగాల్లో ప్రతిష్టాత్మక లారెస్ గ్లోబల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు. పురుషుల విభాగంలోనే గాక అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో కలిపి మెస్సీ రెండు అవార్డులను అందుకున్నాడు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అయిదుసార్లు స్వర్ణం సాధించిన ఫ్రేజర్ ఆరో ప్రయత్నంలో ఈ అవార్డును దక్కించుకుంది. స్పెయిన్ యువ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కారజ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డును, ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సెన్ కమ్బాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు.