మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ విచారణను డొమినికా హైకోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.

న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ విచారణను డొమినికా హైకోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్‌ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చోక్సీ న్యాయవాదుల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.
ఈ మేరకు కోర్టు విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. చోక్సీ బృందం దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్‌పై సైతం విచారణ వాయిదా పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడైన మెహుల్ చోక్సీ 2018లో అంటిగ్వా పారిపోయాడు. గత నెల మే 23న అదృశ్యమైన చోక్సీ.. డొమినికా ద్వీపంలో అనుమానాస్పదంగా కనిపించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అంటిగ్వాలోని జాలీ హార్బర్ నుంచి తనను కిడ్నాప్ చేసి పడవలో డొమినికాకు తీసుకువచ్చారని అతని న్యాయవాదులు ఆరోపించారు. హేబియస్ కార్పస్ పిటిషన్ వాదలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు చోక్సీని రోజౌ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టగా బెయిల్ నిరాకరించారు.
ఇవి కూడా చదవండి..
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ టీకాల ధరలను నిర్ణయించిన కేంద్రం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు
రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. : కేంద్రమంత్రి
దేశంలో 23.88 కోట్ల కొవిడ్ టీకాల పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

