MSVPG Enter 300CroreClub | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 9 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక ప్రోమోను విడుదల చేసింది. మరోవైపు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది. చిరంజీవి మాస్ ఎనర్జీ, నయనతార నటన మరియు విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రెండో వారంలో కూడా అన్‌స్టాపబుల్‌గా బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది.