ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తాను ఒక బిడ్డగా ముందుకు వచ్చి వాళ్లకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అని ఈ మధ్యే చెప్పారు మెగాస్టార్ చిరంజీవి కానీ తాను ఇండస్ట్రీ పెద్దగా మాత్రం ఉండను అని క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాదు అభిమానులకు కూడా ఎప్పుడూ సాయం చేయడంలో ముందే ఉంటాడు మెగాస్టార్ ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా తన వంతు సహాయంగా ముందుకొచ్చి బాధ్యతగా ఉంటాడు అన్నయ్య కరోనా కష్ట కాలంలోనూ, లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులకు, సినిమా జర్నలిస్టులకు సొంత ఖర్చుతో సేవలందించాడు చిరంజీవి.
కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరించి ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు సహాయం చేశాడు మెగాస్టార్. కొన్నాళ్లపాటు సినీ కార్మికుల కాకుండా జర్నలిస్టులకు కూడా నిత్యావసర సరుకులు అందించాడు చిరంజీవి. పైగా 33 కోట్ల సొంత ఖర్చుతో ఆక్సిజన్ సిలిండర్ కూడా అన్ని జిల్లాలకు పంపించాడు. ఇలా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నాడు మెగాస్టార్. మరోవైపు ఇండస్ట్రీకి ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి 2 తెలుగు ప్రభుత్వాలతో చర్చలు కూడా జరుపుతున్నాడు చిరంజీవి. పరిష్కారం దిశగా తన వంతు బాధ్యత పూర్తి చేస్తున్నాడు.
ఈ మధ్య కరోనా బారిన పడి ఇంటికే పరిమితం అయిన చిరంజీవి మళ్లీ ఇప్పుడు బయటికి వచ్చాడు. వచ్చీరాగానే తన అభిమాని కూతురు పెళ్ళికి సాయం చేశాడు చిరంజీవి. తన వీరాభిమాని రాజం కొండలరావు కుమార్తె పెళ్ళికి ఆర్థిక సాయం చేసాడు అన్నయ్య. కొండల్ రావు తన కుమార్తె నీలవేణి పెళ్లి శుభలేఖ చిరంజీవికి ఇచ్చి ఆహ్వానించాడు. దాంతో అభిమానికి పెళ్లి ఖర్చుల నిమిత్తం చిరంజీవి లక్ష రూపాయలు అప్పటికప్పుడే అందజేయడం జరిగింది. అంతే కాకుండా కుమార్తె కి తన ఆశీస్సులు కూడా అందిస్తున్నట్లు తెలిపాడు చిరంజీవి. ఈ విషయం గురించి అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి చిరంజీవి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.