Meera Jasmine | సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ మరోసారి రెచ్చిపోయింది. కొన్ని రోజుల కింద క్లివేజ్ ఫొటో షూట్ షేర్ చేసిన మీరా జాస్మిన్.. ఇప్పుడు మళ్లీ హాట్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు చూసి ఇప్పుడు అందరూ షాకవుతున్నారు. 2003లో శివాజీ హీరోగా వచ్చిన అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మీరా జాస్మిన్. రెండో సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ సినిమాలో అవకాశం అందుకుంది. ఆ తర్వాత రవితేజ భద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత బాలకృష్ణ మహారథి సినిమాలో నటించింది మీరా. కెరీర్ మొదట్లోనే వరుసగా స్టార్ హీరోల సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్.. అంతే వేగంగా మాయమైపోయింది.
తెలుగు కంటే తమిళం, కన్నడ, మలయాళ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. 2014లో పెండ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నేండ్లకు ఇలా ఫొటోషూట్లతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఒకప్పుడు చాలా సంప్రదాయంగా కనిపించిన మీరా జాస్మిన్.. ఇప్పుడు ఇలా రెచ్చిపోవడానికి కారణమేంటని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ మధ్య ఒక హీరో తన సినిమాలో అవకాశం ఇవ్వాలంటే హాట్ ఫొటో షూట్ చేయించుకోవాలని ఈమెకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. రీ ఎంట్రీ కోసమే ఇలాంటి ఫొటోషూట్లు చేస్తోందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈమె ఫొటోలు మాత్రం సోషల్మీడియాలో వైరల్గా మారుతున్నాయి.