మలక్‌పేట, జూలై 17: దిల్‌సుఖ్‌నగర్‌లోని మాంగళ్య షాపింగ్ మాల్లో శుక్రవారం సినీనటి మీనాక్షి చౌదరి సందడి చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాల్లోని నాలుగు ఫ్లోర్లను కలియ తిరిగి చూసిన ఆమె అనంతరం బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేసి స్టెప్పులేసి ఉత్సాహ పరిచారు. పెద్దసంఖ్యలో ప్రజలు, సినీ అభిమానులు నటిని చూసేందుకు షాపింగ్ మాల్ వద్దకు వచ్చారు.
ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూమాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. షాపింగ్ మాల్ సకుటుంబ వస్ర్తాలయమని, మహిళలు, పురుషులు, పిల్లల అభిరుచులకనుగుణంగా సరికొత్త ఫ్యాషన్ డిజైన్ కలెక్షన్లు అందుబాటులో ఉంచారని, వివాహాది శుభ కార్యాలకు కావాల్సిన అన్నిరకాల వస్ర్తాలు ఇందులో లభిస్తాయని తెలిపారు. షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేధారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మూడు రాష్ర్టాల్లో మాంగళ్య షాపింగ్ మాల్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయని, దిల్‌సుఖ్‌నగర్‌లో 32వ శాఖను ప్రారంభించామని తెలిపారు. షాపింగ్ మాల్లో రూ.99 నుంచి రూ.లక్ష వరకు వస్ర్తాలు లభిస్తాయని వారు తెలిపారు.