క్రైస్ట్‌చర్చ్: మీడియం పేసర్ మ్యాట్ హెన్రీ (7/23) విజృంభించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేసిన హెన్రీ ధాటికి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 95 పరుగులకే ఆలౌటైంది. జుబేర్ (25) టాప్ స్కోరర్ కాగా.. ఎల్గర్ (1), ఎర్వీ (10), మార్క్మ్ (15), డసెన్ (8), బవుమా (7) విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్.. గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కాన్వే (36), నికోల్స్ (37 బ్యాటింగ్) రాణించారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న కివీస్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల కంటే 21 పరుగుల ఆధిక్యంలో ఉంది.