జిల్లా న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 4: మంత్రి కేటీఆర్ పిలు పు మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో చేపట్టారు. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేదాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ అన్నారు. సోమవారం జిల్లాలోని మండలాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు హోరెత్తాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాలు సరుకులపై పెంచిన ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనేదాకా ప్రధానిని, కేంద్రప్రభుత్వాన్ని వదలమని టీఆర్ఎస్ నాయకులు మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, రామాయంపేట ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్ అన్నారు. మెదక్ పట్టణంలోని రాందాసు, చౌరస్తాలో మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బట్టి జగపతి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ధర్నాలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మం డిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం మొండి వైఖరిని వీడి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.