శివ్వంపేట/ వెల్దుర్తి/ నర్సాపూర్/ కొల్చారం/చిలిపిచెడ్, మార్చి 30 : నీతి, నిజాయితీకి ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి నిదర్శమని అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేటలో ఎమ్మెల్యే 74వ పుట్టినరోజు వేడుకలను జడ్పీటీసీ మహేశ్గుప్త్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు రమణాగౌడ్ ఆధ్వర్యంలో 74 కిలోల కేక్‌ను కట్ చేశారు.
సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులు, ప్రజాప్రతినిధులు
శివ్వంపేటలో మహిళలకు చీరెలను ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ శివకుమార్‌గౌడ్, ఎండీ రమణాగౌడ్ అందజేశా రు. జడ్పీటీసీ మహేశ్గుప్త్తా వాలీబాల్ కిట్లు, సర్పంచ్ లావణ్యామాధవరెడ్డి కుట్టుమిషన్, పుస్తెమెట్టెలు అందజేశారు. శివ్వంపేటలో పేద కుటుంబాలకు చెన్నాపూర్ సర్పంచ్ భారతీభిక్షపతి రూ. 5వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు శ్రీనివాస్‌గౌడ్, జి.శ్రీనివాస్‌గౌడ్, అనూష, సోని, సుధాకర్‌రెడ్డి, నేతలు కొడకంచి శ్రీనివాస్‌గౌడ్, చింతస్వామి, పవన్కుమార్గుప్త, సుధీర్‌రెడ్డి పాలొన్నారు.
వెల్దుర్తి, మాసాయిపేటతోపాటు గ్రామాల్లోని ఆలయాల్లో పూజలు చేసి, వేడుకలను నిర్వహించారు. వెల్దుర్తి హనుమాన్ దేవాలయంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, సర్పంచ్ భాగ్యమ్మ పూజలు నిర్వహించారు. మాసాయిపేటలో సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యం లో హనుమాన్ ఆలయంలో పూజలు చేసి, గ్రామచావిడి వద్ద కేక్ కట్ చేశారు. ఆయా కార్యాక్రమాల్లో డీసీసీబీ డైరెక్టర్ అనంతరెడ్డి, నేతలు నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, కృష్ణాగౌడ్, రమేశ్గుప్త్తా, గంగాధర్, అశోక్‌గౌడ్, శ్రీను, వెంకటేశం, రాములుగౌడ్, నాగరాజు, రమేశ్, పవన్ ఉన్నారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి పోటెత్తిన అభిమానులు
హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, హైకోర్టు న్యాయవాది శివకుమార్‌గౌడ్ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట వెంకట్‌రెడ్డి ఉన్నారు. నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయాఅశోక్గౌడ్ కార్మికులకు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డై రెక్టర్లు సూరారం నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, సాగర్ ఉన్నారు.
చాకరిమెట్లలో మృత్యుంజయ హోమం, పూజలు
చాకరిమెట్ల ఆంజనేయ ఆలయంలో ఎంపీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ దామతారక హోమం, మృత్యుంజయ, సుదర్శనహోమాలు, పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్‌లు లావణ్యామాధవరెడ్డి, బాలమణీనరేందర్, చంద్రకళాశ్రీశైలం, నేతలు దశరథ, శ్రీనివాస్‌గౌడ్, వీరస్వామి, వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ నేత పైడి శ్రీధర్‌గుప్తా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం లో అన్నదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, నేతలు రమేశ్‌యాదవ్, రావూఫ్ పాల్గొన్నారు. నర్సాపూర్‌లో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ కేక్ కట్ చేశారు. ప్రభుత్వ దావాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఏడుపాయల్లో వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు
కొల్చారం మండల ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీ సావిత్రిరెడ్డి, ఎంపీపీ మంజుల, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గామాతకు పూజలు నిర్వహించారు. రంగంపేటలో సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చిలిపిచెడ్‌లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్‌రెడ్డి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సర్పంచ్ లక్ష్మీదుర్గారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్‌చైర్మన్ రామచంద్రారెడ్డి, నేతలు నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, లక్ష్మణ్, గోపాల్‌రెడ్డి, బుజ్జిబాయి పాల్గొన్నారు.