చిన్నశంకరంపేట, మార్చి 30 : ఆర్థికంగా వెన కబడిన దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని చందంపేటలో దళిత బంధు పథకంలో మంజూరైన మినీ డెయిరీఫాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా నలుగురు లబ్ధ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. దళితబంధు పథకానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మండలానికో గ్రా మాన్ని ఎంపిక చేశామన్నారు. దళిత బంధు పథకానికి నియోజకవర్గంలో 61మంది లబ్ధ్దిదారులను ఎంపిక చేశామని వివరించారు. చందంపేటలో 17 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని తెలిపారు.
దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధ్దిదారులకు రూ.10లక్షల ఆర్థికసాయం అందజేస్తామ న్నారు. లబ్ధ్దిదారులు తమకు ఇష్టమైన యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. జిల్లాలో మొదటిసారిగా దళితబంధు పథకాన్ని చందంపేట గ్రామంలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల సంక్షే మానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదా రులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాధవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, ఎంపీడీవో గణేశ్రెడ్డి, సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీ శివకుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, సింగిల్విండో చైర్మర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
గత ప్రభుత్వాలు దళితుల ను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో దళి తబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొ లబ్ధ్దిదారుడికి రూ.10లక్షలు అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాను.
– రోడ్డ నాగరాజు, దళితబంధు లబ్ధిదారుడు.
సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాను
దళితబంధు ప్రవేశపెట్టి ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తున్న సీఎం కేసీఆర్ సారు కు జీవితాంతం రుణపడి ఉంటా. గత ప్రభుత్వాలు దళితులను ప ట్టించుకోలేదు. సీఎం సారు ఇస్తు న్న రూ.10లక్షలతో డెయిరీఫాం పెట్టుకుని కుటుంబాన్ని పో షించుకుంటా.
– గొర్రె శ్రీనివాస్, దళిత బంధు లబ్ధిదారుడు,