రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధానంగా యువత దృష్టంతా విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులపైనే ఉంది. బీఈడీ, టెట్ పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుండగా, సర్కారు సైతం ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే జిల్లాల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకుని తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో 909 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా, మెదక్ జిల్లాలో 532 ఖాళీ ఉన్నాయని జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులకు జాబితా అందజేసింది. దీంతో ఎంపిక పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నిరుద్యోగులు శిక్షణ కేంద్రాల్లో చేరుతున్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, పోలీసు శాఖ, వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉచిత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎంత కష్టమైనా ప్రభుత్వ కొలువు సాధించాలనే ఉద్దేశంతో ఉద్యోగార్థులు రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. దీంతో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న యువత సంతోషం వ్యక్తం చేస్తూ, ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్నది. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తారని బీఈడీ, టెట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎదురుచూస్తుండగా, ఆయా పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను విద్యాశాఖ సేకరించింది. ఆయా జాబితాలను ఇప్పటికే అధికారులు ఉన్నతాధికారులకు అందజేశారు. కాగా, మెదక్‌లోని 532, సంగారెడ్డి జిల్లాలో 909 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నారు. ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో 909 ఖాళీలు..
విద్యాశాఖ అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో మొత్తం 6030 సాంక్షన్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 5121 పోస్టులు భర్తీ ఉండగా, లోకల్ బాడీ, గవర్నమెంట్ స్కూల్ కలిపి మొత్తం 909 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో గ్రేడ్-2 హెచ్ఎం పోస్టులు 72, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు 102 ఖాళీగా ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు కలిపి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 284, ఎస్జీటీ పోస్టులు 365 ఖాళీగా ఉండగా, తెలుగు పండిట్ పోస్టులు 15, హిందీ పండిట్ పోస్టులు నాలుగు, ఉర్దూ పండిట్ పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయి. తెలుగు మీడియం పీఈటీ పోస్టులు రెండు, ఉర్దూ మీడియం ఒకటి, కన్నడ మీడియం ఒకటి ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు తెలుగు మీడియం డ్రాయింగ్ 22, క్రాఫ్ట్ 25, మ్యూజిక్ టీచర్ పోస్టులు ఆరు, ఓకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు నాలుగు, రిసోర్స్ టీచర్ పోస్టు ఒకటి, జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఒకటి ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులు త్వరలోనే భర్తీ అయ్యే అవకాశమున్నది.

ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఖాళీ
సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. మొత్తం 909 పోస్టులు ఖాళీ ఉండగా, ఇందులో ఎస్జీటీ పోస్టులు 365 ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులు 207, ఎస్జీటీ ఉర్దూ మీడియం పోస్టులు 51, ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టులు నాలుగు, ఎస్జీటీ కన్నడ మీడియం పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 284 ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ మాథ్స్(తెలుగు) 20, (ఉర్దూ) ఏడు, (కన్నడ) ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ (తెలుగు) 12, (ఉర్దూ) ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ (తెలుగు) 59, (ఉర్దూ) నాలుగు, (ఇంగ్లిష్) ఒకటి, (కన్నడ) ఒక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ (తెలుగు) 93, (ఉర్దూ) 12, (ఇంగ్లిష్) ఒక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 18, (హిందీ) 10, (ఇంగ్లిష్) 24, (ఉర్దూ) ఏడు, (కన్నడ) ఒక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (తెలుగు) ఐదు, (ఉర్దూ) ఒక పోస్టు ఉన్నాయి. ఆయా పోస్టులు త్వరలో భర్తీ అయ్యే అవకాశాలున్నాయి.
మెదక్‌లో 532 ఉపాధ్యాయ ఖాళీలు
తెలంగాణ ప్రభుత్వం కొత్తజోన్లు, జిల్లాల విభజన తరువాత తొలిసారిగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. మెదక్ జిల్లాలో అన్నిశాఖలు కలుపుకొని 1149 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. అందులో విద్యాశాఖలో వచ్చే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం 532 ఖాళీలు ఉన్నట్లుగా నివేదించారు. జిల్లాలో 923 పాఠశాలలు ఉండగా 3,993 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 3,461 మంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా, జిల్లాలో సుమారు 4వేల మంది బీఎడ్, డీఎడ్ అర్హత కలిగిన వారున్నట్లు విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు విద్యార్థులు ఉపాధ్యాయ పోస్టులు సాధించడానికి సిద్ధమవుతున్నారు.
ఉపాధ్యాయ ఖాళీలు..
సంగారెడ్డిలో : 909
మెదక్‌లో : 532
సంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో ఖాళీల వివరాలు
కేటగిరీ: ఖాళీ పోస్టులు
గ్రేడ్-2 హెచ్ఎం: 72
ప్రైమరీ స్కూల్ హెచ్ఎం :102
స్కూల్ అసిస్టెంట్ ఆల్ కేటగిరీ: 284
ఎల్పీ తెలుగు: 15
ఎల్పీ హిందీ :4
ఎల్పీ ఉర్దూ: 4
ఎస్జీటీ తెలుగు: 207
ఎస్పీటీ ఉర్దూ :151
ఎస్జీటీ ఇంగ్లిష్ :4
ఎస్జీటీ కన్నడ :3
పీఈటీ తెలుగు :2
పీఈటీ ఉర్దూ :1
పీఈటీ కన్నడ :1
డ్రాయింగ్ టీచర్ తెలుగు: 22
క్రాఫ్ట్ టీచర్ తెలుగు :25
మ్యూజిక్ టీచర్ తెలుగు: 6
ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ :4
రిసోర్సు టీచర్ :1
జూనియర్ అసిస్టెంట్ :1
మొత్తం :909
ఖాళీల వివరాలు అందజేశాం..
సంగారెడ్డి జిల్లా విద్యాశాఖలోనే ఖాళీల వివరాలను విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్‌కు అందజేశాం. జిల్లా మొత్తం 909 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నది.
– నాంపల్లి రాజేశ్, సంగారెడ్డి డీఈవో
మెదక్ జిల్లా విద్యాశాఖలో ఖాళీల వివరాలు
కేటగిరీ: ఖాళీ పోస్టులు
గెజిటెడ్ హెడ్మాస్టర్: 68
ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం: 57
స్కూల్ అసిస్టెంట్ గణితం: 25
” ఫిజికల్ సైన్స్ :4
” బయోలాజికల్ సైన్స్ :48
” సాంఘిక శాస్త్రం :74
” ఆంగ్లం :24
” తెలుగు :15
” హిందీ :9
” ఫిజికల్ ఎడ్యుకేషన్: 5
ఎస్జీటీలు: 122
భాష పండితులు తెలుగు: 8
” హిందీ :14
క్రాప్ట్ :16
డ్రాయింగ్: 12
ఒకేషనల్ :1
ఎస్జీటీ (ఇంగ్లిష్) గణితం: 1
” ఫిజికల్ సైన్స్ :2
” బయోలాజికల్ సైన్స్: 2
స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) సోషల్: 2
” ఉర్దూ: 2
ఎస్జీటీ: 19
భాషా పండితులు ఉర్దూ :2
మొత్తం :532
సర్కారు విద్య మరింత బలోపేతం
ప్రభుత్వం చేపట్టనున్న ఖాళీల భర్తీతో సర్కారు విద్య మరింత బలోపేతం కానున్నది. మెదక్ జిల్లాలోని ఖాళీల వివరాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలో పోస్టులన్నీ భర్తీ కానున్నాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందనున్నది.
– రమేశ్‌కుమార్, మెదక్ డీఈవో