సంగారెడ్డి, మార్చి 21 : హైదరాబాద్ మహానగరం విస్తురిస్తున్నందున ప్రభుత్వం హెచ్ఎండీఏ లే అవుట్‌కు ఆదేశాలు ఇచ్చిందని తహసీల్దార్ అన్నారు. సోమవారం కంది మండ లం ఆరుట్ల గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 133లో ఉన్న 120 ఎకరాల్లో రైతులతో గ్రామం లో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గ్రామస్తుల అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తామని రెవె న్యూ అధికారులు రైతులకు వివరించారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ లే అవుట్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నదన్నారు.
హెచ్ఎండీఏ లే అవుట్ ఏర్పాటు అయితే భవిష్యత్‌లో అభివృద్ధిలో గ్రామానికి మంచి పేరు వస్తుందని సూచించారు. ప్రస్తు తం సాగు చేస్తున్న భూముల్లో ఏఏ పంటల వేశారో చెప్పండి అని రైతులను అధికారులు కోరగా కంది, వరి, మక్కజొన్నతో పాటు కొంతమంది రైతులు ఏ పంటలు వేయలేదని తెలిపారని తహసీల్దార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిశీలించి లే అవుట్లకు అనుకూలంగా ఉంటే రైతులతో మాట్లా డి ఒప్పించి తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఎకరా భూమి ఉన్నవారికి 250 గజాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు రైతులకు వివరించారు. గ్రామానికి చెందిన వందమంది అన్నదాతలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని రైతులు అధికారులకు చెప్పారు. తమకు కొన్నేండ్లుగా మా తండ్రుల నుంచి వచ్చిందని ఉన్న భూమిని ఇచ్చేస్తే జీవనం సాగేదేలా అని అధికారులకు రైతులు గోడును వినిపించారు.
ప్రభుత్వ భూములు, అమ్మడం కాని కొనడం గాని చేయడానికి వీలులేదని, అలాంటి విధానాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. గ్రామానికి చెందిన రైతులందరి ఇష్టంతోనే హెచ్ఎండీఏ లే అవుట్ చేసేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నదని ఎవరి బలవంతమో..అధికార ప్రయోగం లేదని రైతులు గుర్తించి సానుకూలంగా ఆలోచన చేసి అభివృద్ధికి సహకరించాలని తహసీల్దార్ విజయలక్ష్మి రైతులను కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ కాసాల రాంరెడ్డి, గిర్దావర్ సంతోష్, సర్వేయర్ శ్రీనివాస్ గ్రామస్తులు, ప్రభుత్వ భూముల రైతులు పాల్గొన్నారు.