పెద్దశంకరంపేట/ చిలిపిచెడ్, మార్చి 19 : ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నారాయణఖేడ్ క్యాంపు కా ర్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని గోపనివెంకటాపురం గ్రామానికి చెందిన మన్నె మల్లయ్యకు మంజూరైన రూ.33వేల సీఎం రిలీప్ ఫండ్ చెక్కు అందజేశారు. ప్రజల సం క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమం లో సర్పంచ్ కుంట్ల రాములు, పీఎసీఎస్ వైస్ చైర్మన్ సువర్ణ అంజయ్య, నాయకులు గోపని రవి, మన్నె మోహన్ ఉన్నారు.
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం..
ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహార్నిశలు కృషి చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను ఆయన స్వగృహాంలో చిలిపిచెడ్ మండలం లోని గౌతాపూర్ నాయకులు కలిసి, ఆరోగ్య పరిస్థి తిని ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం గౌతాపూర్ గ్రామానికి చెందిన లబ్ధ్ధిదారుల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ స్వరూపావిఠల్ కు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు సీఎం ఆర్ఎఫ్ వరమన్నారు. గ్రామానికి చెంది న శ్రీలతకు రూ.16వేల సీఎంఆర్ ఎఫ్ చెక్కును సర్పంచ్ అందజేశారు. కార్యక్రమంలో నేతలు మాణిక్యరెడ్డి, నర్సింహరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, యాసిన్ ఉన్నారు.
అమ్మవారి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం..
వెల్దుర్తి/ రామాయంపేట, మార్చి 19. వెల్దుర్తి మండలం లోని మానేపల్లిలో ఈ నెల 26 నుంచి 31 వరకు నిర్వహించనున్న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను టీఆర్ఎస్ నేత నరేందర్‌రెడ్డి అం దజేశారు. నగరంలో ఎమ్మెల్యేను కలిసినవారిలో నాయకులు స్వామి, రాములు, కుమార్, సత్యనారాయణ ఉన్నారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఆహ్వానం
రామాయంపేటలో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలకు హాజ రుకావాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యు లు ఆహ్వాన పత్రిక అందజేశారు. శుక్రవారం రాత్రి హవేళీఘనపూర్ మండలం కూచారం గ్రామంలో ఎమ్మెల్సీని పెద్దమ్మ ఆల య కమిటీ సభ్యులు ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచ య్య, పుటి అక్షయ్‌కుమార్ కలిసి ఆహ్వానించారు.