రామాయంపేట, మార్చి 12: రైతులు అప్రమత్తంగా ఉం డాలి, రైతులకు అండగా మేమున్నామని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ పేర్కొన్నారు. శనివారం రామాయంపేటకు విచ్చేసిన అధికారి శుక్రవారం రాత్రి చిరుత సంచరించిన రామాయంపేట పట్టణ శివారు జాతీయ రహదారి కొయ్యగుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత అడుగులను క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున అడవి జంతువులు బయటకు దాహం కోసం వస్తాయని తెలిపారు. ప్రస్తుతం చిరుత ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయిందన్నారు. రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దన్నారు.
చిరుత రాకుండా బోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒంటరిగా రైతులు రాత్రిళ్లు గాని ఉదయం సాయంకాలం వేళలో కూడా వ్యవసాయ బావులకు వెళ్ల వద్దన్నారు. అడవి జంతువులకు ఎవరు కూడా ఎలాంటి నష్టం చేయొద్ద ని సూచించారు. అడవి జంతువులు రాకుండా అటవీశాఖ జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. జంతువులు ఎక్కువ శాతం నీరు, ఆహారం కోసమే బయటకు వస్తాయన్నారు. ప్రస్తుతం అధికారులు అప్రమత్తంగానే ఉన్నారని పేర్కొన్నారు. డీఎఫ్ వో వెంట రామాయంపేట ఎఫ్ఆర్వో విద్యాసాగర్, డిప్యూటీ ఎఫ్ఆర్వో కుత్బుద్దీన్, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.