సదాశివపేట, మార్చి 12: తెలంగాణప్రభుత్వంలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయి. నిరుపేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే అన్ని సర్కారు దవా ఖానలను సమూలంగా మార్చింది. గ్రామీణ ప్రాంతా ల్లో ఏఎన్ఎం, ఆశవర్కర్ల ద్వారా ప్రజలకు మె రుగైన సేవలు అందిస్తున్నది. తాజాగా ఆశ వర్కర్లకు స్మార్ట్ఫోన్లు, 4జీ సిమ్‌లు అందజేసింది. సదాశివపేట మం డలంలో 58మంది ఆశ వర్కర్లు ఉన్నారు. ఇందు లో సదాశివపేట అర్బన్ ప్రాంతంలో 16మంది, ఆత్మకూ ర్ పీహెచ్‌ఎసీ రూరల్ ప్రాంతంలో 42మంది ఆశ వర్కర్లు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ను అందించింది.
ఆశ డిసీస్ ప్రొఫైల్ యాప్‌లో నమోదు..
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆశవర్కర్లకు స్మార్ట్ఫోన్లను అందించింది. స్మార్ట్ ఫోన్లో నేరు గా గర్బిణులు, రోగుల సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్లైన్లో నమోదు చేస్తారు. సదాశివపేట అర్బన్ ప్రాంతంలో 16మంది ఆశ వర్కర్లు, ఆత్మకూర్ పీహెచ్సీ రూరల్ ప్రాంతంలో 42మంది ఆశ వర్కర్లు ఉ న్నారు. వీరందరికీ ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆశవర్కర్లు ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ సమాచారం తెలుసుకుంటారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయనున్నా రు. ఆరోగ్య సర్వే, టీబీ, లెప్రసీ సర్వే, పుట్టిన బిడ్డలకు వ్యాక్సిన్లు ఇప్పించడం, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్య వివరాలు, బీపీ, మధుమే హం వ్యాధి గ్రస్తులను పరీక్షించి ఆయా నివేదికలను ఆశ డిసీస్ ప్రొఫైల్ యాప్ ద్వారా ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఇదిలా ఉండగా ఆశ వర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే ఉండేది. తెలంగాణ ఏర్పడిన వెంటనే వేతనాన్ని రూ.3వేలు, తర్వాత రూ.7,500కు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పీఆర్సీ అమలు చేయడంతో వేతనం 9,750కి చేరింది. గతంలో ఆశ వర్కర్లకు జీతాలు రెండు మూడు నెలలకోసారి వచ్చేవి, తెలంగాణ ప్రభు త్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా నెల వారీ గా బ్యాంకుల్లో జీతాలు జమకావడంతో ఆశ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో..
ఆశ వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశాం. ఆశ డిసీస్ ప్రొఫైల్ యాప్‌లో ప్రజారోగ్య వివరాలు అందుబాటులో ఉంటాయి. వైద్య ఆరోగ్య శాఖ సూచించిన విధంగా ఆశలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తారు. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉన్నది.
– సుందరి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, ఆత్మకూర్ పీహెచ్సీ
పనిభారం తగ్గుతుంది..
స్మార్ట్ఫోన్లతో పనిభారం తగ్గింది. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తాం. స్మార్ట్‌ఫోన్ వల్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటు న్నాం. గ్రామాల్లో అత్యవసర సేవలు అందించేందు కు ఎంతో ఉపయోగపడుతుంది.
– శశికల, ఆత్మకూర్ ఆశ వర్కర్