కొల్చారం, మార్చి 12 : మండలంలోని పోతంశెట్‌పల్లి చౌ రస్తాలో శనివారం రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదా రులకు ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే వచ్చే అనర్థాలను వివరించారు. వాహనదారులు సురక్షితంగా చేరాలనేదే పోలీసుల లక్ష్యమన్నారు. వాహనదారులందరూ తప్పకుండా రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. కారు నడిపేవారు సీట్ బెల్టు, మోటర్‌సైకిల్ నడిపేవా రు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు పాటించనివారికి జరిమానా విధిస్తామని ఎస్సై హెచ్చరించారు.
రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
రామాయంపేట, మార్చి 12 : రోడ్డు భద్రతా వారోత్సవాలపై హైదరాబాద్‌కు చెందిన నిర్జర సోలార్ ఉజ్రా ఎన్జీవో ప్రతి నిధులు కోనాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 70 మంది విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్స్, స్నాక్స్ అందజేశారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రెండువైపులా చూసి వాహనాలు రానప్పుడే రోడ్డు దాట్టాలని వివిరించారు. కార్యక్రమం లో ఎన్జీవో సభ్యులు సంతోష్‌రెడ్డి, అఫ్రోజ్, పాతన్, కిరణ్, మ నోజ్, హెచ్ఎంలు రవీందర్‌గౌడ్, నాగేశ్వర్రావు ఉన్నారు.