మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ అర్బన్/ మెదక్ రూరల్/ పాపన్నపేట/ అల్లాదుర్గం/ హవేళిఘనపూర్, మార్చి 8 : సృష్టికి మూలం స్త్రీ.. స్త్రీ లేకుంటే విశ్వం లేదని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. మంగళవారం మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, మహిళా కార్మికులను సన్మానించారు. మెదక్ మున్సిపల్లో 32 స్థానాల్లో 18 స్థానాల్లో మహిళలే ఉన్నార న్నారు. రిజర్వేషన్ స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లో సైతం పోటీ పడుతున్నారని, మహిళలు స్వయం కృషితో నిర్ణయాత్మక శక్తిగా ఎదగలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా సం ఘాలకు రూ.60 లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు లలిత, కల్యాణి, వనజ, లక్ష్మి, నర్మద, జయశ్రీ, మమత, యశోధ, మేఘమాల, రుక్మిణి, లక్ష్మీనారాయణగౌడ్, కిశోర్, లింగం, విశ్వం, శ్రీనివాస్ శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, మెప్మా పీఆర్పీ సునీత పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కామన్ సర్వీస్ సెం టర్ జిల్లా మేనేజర్ రాజు అన్నారు. కామన్ సర్వీస్ సెంటర్లో గ్రామ వలంటీర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
మెదక్ కోర్టు అవరణలో మహిళా దినోత్సవం
మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రీటాలాల్చంద్ అన్నారు. మెదక్ కోర్టు అవరణలో మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడాపోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఏఎస్సై రుక్సానా బేగం, కానిస్టేబుళ్లు మౌనిక, ప్రమీల, శ్రీలత, శ్వేతను సీఐ మధు సన్మానించారు. కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్యంగం కల్పించిన అన్ని హక్కులను మహిళలు వినియోగించుకోవాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. జిల్లా కేం ద్రంలోని ఏరియా దవాఖానలో సూపరింటెండెంట్ అధ్వర్యం లో మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా మహిళ డాక్టర్లు, నర్సులను జిల్లా ఎస్పీ సన్మానించారు.
మెదక్ మండలం పాతూరులో ఎంపీవో మౌనిక, సర్పంచ్ లింగమ్మ, పంచాయతీ కార్యదర్శి నయీం, టీఆర్ఎస్ నాయకుడు బాలయ్య పాల్గొన్నారు. ఖాజీపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాలలో కార్మికులు లక్ష్మి, నిర్మల, సత్తమ్మను హెచ్ఎం భా స్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు సన్మానించారు. మంబోజిపల్లి, గీత పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి, హెచ్ఎం మాధవీ రామాంజనేయులు బహుమతులు అందజేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సేవలు వెలకట్టలేనివి..
మధ్యాహ్న భోజన మహిళా కార్మికుల సేవలు వెలకట్టలేనివని పాపన్నపేట మండల విధ్యాధికారి నీలకంఠం పేర్కొన్నారు. పాపన్నపేట, చీకోడ్, లింగాయపల్లి ఉన్నత పాఠశాలలో మహిళా కార్మికులను సన్మానించారు. కార్యక్రమం లో జిల్లా పరీక్షల విభాగాధికారి రామేశ్వరప్రసాద్, హెచ్ఎం సుశీలరాథోడ్, టీచర్లు సిద్ధిరాములు, రమేశ్, సర్పంచ్ విజయా తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ నారాయణరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ రవి పాల్గొన్నారు.
చేవెళ్లలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో అల్లాదుర్గం జడ్పీటీసీ సౌందర్య, మాజీ ఎం పీపీ కాశీనాథ్, వైస్ ఎంపీపీ స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచ్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. హవేళిఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మహిళలను ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మండల కో అప్షన్ సభ్యులు కాలేద్, సర్పంచ్ సవిత, ఎంపీవో ప్రవీణ్ సన్మానించారు.
మహిళాలు ఆత్మ ైస్థెర్యంతో ముందుకు సాగాలి
నర్సాపూర్/ చిలిపిచెడ్/ వెల్దుర్తి/ శివ్వంపేట, మార్చి 8 : నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయాఅశోక్గౌడ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లను సన్మానిం చారు. అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, టీఆర్ఎస్ శివంపేట్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, టీఆర్ఎస్ నర్సాపూర్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, కౌన్సిలర్ రమేశ్‌యాదవ్, ఏఎంసీ డైరెక్టర్లు రావూఫ్, సాగర్, నేతలు భిక్షపతి, నగేశ్, రాకేశ్‌గౌడ్ ఉన్నారు.
బీవీఆర్ఐటీ కళాశాలలో జరిగిన వేడుకల్లో 1000 మంది పాల్గొన్నారు. మహిళా అధ్యాపకులను ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ సన్మానించారు. కార్యక్రమంలో హెచ్వోడీలు ఏవో బాపిరాజు, అశోక్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.పి.దశరథ రామయ్య, కో-ఆర్డినేటర్ డాక్టర్ బీమా పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు సన్మానం
చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామ నాయకులు హైదరాబాద్‌లోని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిని కలిసి సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్‌రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, చిట్కుల్, బద్రియాతండా టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు నారాగౌడ్, దుర్గానాయక్ ఉన్నారు.
తెలంగాణ సర్కార్‌లోనే మహిళలకు తగిన గుర్తింపు వచ్చిందని మెదక్ మార్కెట్ వైస్‌చైర్మన్, కొల్చారం మాజీ ఎంపీపీ చందాపురం సావిత్రీరెడ్డి అన్నారు. చిన్నాఘన్పూర్లో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ ఇందిరాప్రియదర్శిని, మహిళా ఉపాధ్యాయురాలు, ఆశ, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా మహిళలను సన్మానించారు. పైతరలో సర్పంచ్ సంతోషతోపాటు ఆశ, అంగన్వాడీ సిబ్బందిని స్థానిక నాయకులు సన్మానించారు.
ప్రభుత్వం మహిళాభివృద్ధ్దికి నిరంతరం కృషి చేస్తున్నదని వెల్దుర్తి ఎంపీపీ స్వరూప అన్నారు. వెల్దుర్తిలోని బాలాజీ ఫంక్షన్హాల్లో 50మందిని శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఎంఈవో యాదగిరి, సర్పంచ్ అశోక్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్రీనునాయక్, క్రిష్ణతోపాటు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని శివ్వం పేట ఎంపీపీ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ అన్నారు. నర్సాపూర్‌లో నిర్వహించే సంబురాలకు శివ్వంపేట నుంచి మహిళలు ర్యాలీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లావణ్యామాధవరెడ్డి, అనూషాఅశోక్గౌడ్, స్వరాజ్యలక్ష్మీశ్రీనివాస్గౌడ్, సోనీరవినాయక్, బాలమణీనరేందర్, ఎంపీటీసీలు దశరథ, గోవింద్, నాయకులు రాజశేఖర్‌గౌడ్, వంజరి కొండల్, పవన్‌కుమార్‌గుప్తా, షేక్‌అలీ, భీమనపల్లి మురళి పాల్గొన్నారు.
మహిళలను గౌరవిస్తే దేవతలను పూజించినట్లే
రామాయంపేట/నిజాంపేట/మనోహరాబాద్/ తూప్రాన్/ చేగుంట, మార్చి 8 : మహిళలను గౌరవిస్తే దేవతలను పూజించి నట్లేనని రామాయంపేట ఎస్సై రాజేశ్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ టీవీపీ చారి, చైర్మన్లు యాదగిరి, లక్ష్మణ్‌యాదవ్ అన్నారు. రామాయంపేటలోని సాయికృప కళాశాలలో కార్మికులు, పోలీసులు, వైద్యులను సన్మానించారు. ప్రముఖ గాయని శర్వాణి పాటలు పాడి ఆలరించారు. కార్యక్రమంలో దామోదర్‌రావు, కృష్ణవేణి, సంపూర్ణ, చందన, శ్రీనువాస్‌రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్‌శర్మ, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.
సృష్టిలో స్త్రీ పాత్ర గొప్పది : ఎక్సైజ్ సీఐ జయసుద
సమాజంలో స్త్రీ పాత్ర గొప్పదని రామాయంపేట ఎక్సైజ్ సీఐ జయసుద అన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లు యశోద, రజిత, ఎక్సై జ్ ఎస్సై విజయసిద్దార్ధను సన్మానించారు. నిజాంపేటలో సర్పం చ్ అనూష, ఎంపీటీసీ లహరిని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్ సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, డైరెక్టర్ కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ బాబు, వార్డు సభ్యులు రాజు, తిరుమల్‌గౌడ్, ఆగయ్య, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు నాగరాజు, నాయకులు లక్ష్మీనర్సింహులు, ఎల్లం, నగేశ్ పాల్గొన్నారు. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి(పీటీ) గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడారు. సర్పంచ్ ప్రభావతి మహిళలను సన్మానించారు. మనోహరాబాద్‌లో సర్పంచ్ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు జావీద్, చంద్రశేఖర్ ఉన్నారు.
తూప్రాన్ మున్సిపాలిటీలో…
తూప్రాన్ మున్సిపల్‌కార్యాలయంలో మహిళలను సన్మానిం చి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ రవీందర్‌గౌడ్, ఎంపీపీ స్వప్న, కమిషనర్ మోహన్ పాల్గొన్నారు. వట్టూర్‌లో అంగన్ వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, టీచర్లను సర్పంచ్ జనమ్మ, వార్డు సభ్యులు ముత్యాలు, స్వామి సన్మానించారు. తూప్రాన్‌లోని గీత పాఠశాలలో కరస్పాండెంట్ రామాంజనేయులు, ప్రిన్సిపాల్ వెంకటకృష్ణారావు, ప్రేమ్‌రాజ్, రాజేశ్వర్, అధ్యాపకులు నరేం దర్, రమాదేవి, శాంతి, సుగుణ, కవిత పాల్గొన్నారు. చేగుంటలో ఉపాధ్యాయురాళ్లు, మహిళా ప్రజాప్రతినిధుల ను ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్ సన్మానించారు. రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేష్ బ్యాంక్ సిబ్బందిని సన్మానించారు. నార్సింగిలో మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను ఎంపీపీ సబిత, వైస్ ఎంపీపీ సుజాత, టీఆర్ఎస్ నేతలు మైలరాం బాబు, పట్టణాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎర్రం అశోక్, అంచనూరి రాజేశ్ సన్మానించారు. కా ర్యక్రమంలో నేతలు కుమ్మరి నర్సింహులు, శ్రీపతిరావు, నర్సింహాచారి, వీఏవోలు పాల్గొన్నారు.