జహీరాబాద్, మార్చి 8: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పనులు అద్భుతంగా ఉన్నాయని, దేశం లో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని శిక్షణ ఐపీఎస్, ఐఎఫ్వోఎస్, ఐడీఎస్ఈ, ఐపీవోఎస్ అధికారులు తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బీ) గ్రామంలో అమలు చేస్తున్న పల్లె ప్రగతి పనులు పరిశీలించారు. గ్రామంలో చేస్తున్న పారిశుధ్య పనులు, మిషన్ భగీరథ, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రైతు వేదిక బాగున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాల లో మౌలిక వసతులు కల్పించి, నా ణ్యమైన బోధన చేసే మేలు కలుగుతుందన్నారు.
దేశవ్యాప్తంగా పర్యటించామని, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎక్క డా లేవన్నారు. జమ్ముకాశ్మీర్, ఉత్తర్ప్రదేశ్, బీహార్, రాజస్థాన్లో ఎక్కడ ఇంత మంచి పనులు జరగడం లేదన్నారు. తెలంగాణలో పట్టణాలతో పోటీగా గ్రామాలు అభివృద్ధి సా ధిస్తున్నాయన్నారు. హరితహారంలో మొక్కలు నాటి, సంరక్షించడంతో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నివేది క తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తామన్నారు. ఆరోగ్యఉపకేంద్రంలో రోగులకు మందులు పంపిణీ, రికార్డులను పరిశీలించారు.
తెలంగాణ పథకాలు చాలా బాగున్నాయని, వీటిని అన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. సంగారెడ్డి జడ్పీ సీఇవో ఎల్లయ్య, జహీరాబాద్ ఎంపీడీవో సుమతి, ఎంపీవో మహేశ్వర్రావు, సర్పంచ్ జగన్, పంచాయతీ కార్యదర్శి హనుమంత్ గ్రామ అభివృద్ధి వివరాలు తెలిపారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రైతు వేదిక, వైకుంఠ ధామం, మిషన్ భగీరథ్ నల్లాలు, ఆరోగ్య ఉపకేంద్రం, ఉపాధి పనులు, పారిశుద్ధ్య పనులను అధికారులు పరిశీలించారు.