సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): చేతి వేళ్లతో అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వాటి కదలికలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడపవచ్చు. వేలి కొనలను కలపడం ద్వారా మనస్సును ప్రశాంతంగా చేసుకోవచ్చు. శరీరంలోని ప్రతి భాగాన్ని కదిలించే శక్తి చేతివేళ్లకు ఉంది. అనేక నాడులను చైతన్యపరిచి ఆరోగ్యంగా ఉంచడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయి. ఇలాంటి సాధనను యోగా ముద్రగా పిలుస్తారు. యోగాసైన్స్లో చేతివేళ్ల కొనలకు అతీత శక్తులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. హస్తంలోని ఒక చేతివేలు ఇంకొక చేతి వేలుతో తాకి సంబంధిత నరాలపై ప్రభావం చూపడం వలన శరీరంలో ఆరోగ్యకర మార్పులకు నాంది పడుతుంది. ప్రస్తుతం ఈ యోగ ముద్రలు సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతున్నాయి. అనేక రోగాల విరుగుడుకు మెడిటేషన్, యోగా ఎంత అవసరమో.. ముద్రల సాధన కూడా అంతే ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన పూర్వీకులు చేతివేలి కొనల కదలికలతో అనేక రోగాల నుంచి ఉపశమనం పొందినట్టు నిపుణులు చెబుతున్నారు.
చేతి వేళ్లలోనేమన ఆరోగ్యం
ప్రతి ఒక్కరూ చెయదగిన ముద్రలు. పెద్దగా కష్టపడక్కర్లేదు. మన చేతివేళ్లను వివిధ రూపాల్లో అమర్చితే సరిపోతుంది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు, ఆస్తమా తదితర అనేక రోగాలు దరి చేరుతున్నాయి. అలాంటి రోగాలన్నింటికి సాధ్యమైనంతగా దూరంగా ఉండేందుకు యోగా ముద్ర సాధనలు ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరూ ముద్రలను పాటించి ఆరోగ్యంగా ఉండొచ్చు.
– నేతికర్ లివంకర్, యోగా నిపుణులు
ఆ ముద్రలు ఇవే..
సాధారణంగా 300 యోగా ముద్రలను మన పూర్వీకులు అవలంభించారు. ఆ సాధన నేటి తరానికి ఇంకా పూర్తిస్థాయిలో చేరుకోలేదు. అయితే ప్రస్తుతం ముఖ్యమైన 15 ముద్రలు వాడుకలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. జ్ఞాన ముద్ర, ప్రీత్వి ముద్ర, అపంజ ముద్ర, ప్రాణ ముద్ర, వాయు ముద్ర, ఆకాశ ముద్ర, అనంతమైన ముద్ర, వరుణ ముద్ర, జలోధర్ నాషక్ ముద్ర, అపనావాయు ముద్ర, ధ్యాన ముద్ర, వ్యాన ముద్ర, లింగా ముద్ర, శంఖా ముద్ర, యోని ముద్ర లకు ఆరోగ్యాన్ని బలోపేతం చేసే సామర్థ్యం ఉంటుంది.
ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆ ముద్రలు ఇవే
చిటికెన వేలు
కొనను బొటనవేలి కొనతో తాకించాలి. మిగిలిన మూడు వేళ్లను పైకి చూపించాలి. దీన్ని వరుణ ముద్రగా పిలుస్తారు.