
రామాయంపేట, అక్టోబర్ 28: రెండు మండలాల ప్రజలు వ్యాక్సిన్‌పై ఎలాంటి నిర్లక్ష్యం చేయద్ద్దని డీ.ధర్మారం ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్‌రాణి అన్నారు. గురువారం నిజాం పేట, రామాయంపేట మండలాల్లో అన్ని గ్రామాల్లో శిబి రాలను ఏర్పాటు చేసి కోనాపూర్లోఎంపీపీ భిక్షపతితో కలిసి టీకా వేశారు. అనంతరం వైద్యురాలు మాట్లాడారు. 18 గ్రా మాల్లో గురువారం సుమారు వెయ్యి మందికి కొవిడ్ టీకా వేశామని తెలిపారు. ఇప్పటి వరకు రెండు మండలాల వ్యా ప్తంగా కొవిడ్ టీకా 85శాతం వరకు వేశామన్నారు. కార్య క్రమంలో కోనాపూర్ సర్పంచ్ చంద్రకళ, మాజీ సర్పంచ్ బీరయ్య, వైస్ చైర్మన్ హరికిషన్, ఇమ్మానియేల్, సూపర్ వైజర్లు, ఏఎన్ఎంలు సుశీల, ఎలిషా, శోభ, మార్గదర్శిని, ఆశ వర్కర్లు ఉన్నారు.
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి
మున్సిపాలిటీ లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు మున్సిపల్ కార్యాలయంలో ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఆర్పీలు పట్టణ వ్యాప్తంగా సర్వే చేపట్టి వ్యాక్సిన్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు, సమాచారం తీసుకోవాలన్నారు. ఎవరైనా మొదటి , రెండో టీకాలను తీసుకోకుంటే వెంటనే సిబ్బందితో టీకా వేయించాలన్నారు. సమావేశంలో టౌన్‌ప్లానింగ్ అధికారి లక్ష్మీపతి, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు ఉన్నారు.
మనోహరాబాద్‌లో…
మనోహరాబాద్, అక్టోబర్ 28: తూప్రాన్, మనోహరాబాద్, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. శివ్వంపేటలో మండల ప్రత్యేకాధికారి నర్సయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే లా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచిం చారు. మనో హరాబాద్ మండలం కాళ్లకల్‌లో జరిగిన వ్యాక్సినేషన్ కార్య క్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశ్, ఎంపీపీ పురం నవనీతరవి పాల్గొన్నారు.
కరోనా వ్యాక్సిన్‌పై ఇంటింటి సర్వే
కొల్చారం, అక్టోబర్ 28:మండల వ్యాప్తంగా కరోనా టీకా తీసుకోని వారిని గుర్తించడానికి ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ టీకా తీసుకోని వారిని గుర్తించి నమోదు చేసుకున్నారు.
అల్లాదుర్గంలో…
అల్లాదుర్గం,అక్టోబర్ 28: మండల పరిధిలోని గొల్లకుంట తండాలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీడీవో విజయ భాస్క ర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వ్యాక్సినేషన్ మండలంలో వంద శాతం పూర్తి చేయా లన్నారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకొని నిర్ణీత గడువు తరువాత ప్రతి ఒక్కరూ రెండో డోస్ తీసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో ఎంపీవో సయ్యద్, శివరాం రాథోడ్ పాల్గొన్నారు.
మెదక్రూరల్లో…
మెదక్‌రూరల్ ,అక్టోబర్ 28: కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేసుకోవాలని మండల వైద్యాధికారి చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని మంబోజిపల్లిలో హెల్త్ సూపర్వైజర్ ర మేశ్ , శ్రీనివాస్ , ఏఎన్ఎం హేమలత, ఆధ్వర్యంలో అంగన్వాడీ ,ఆశ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ సర్వే నిర్వహించారు. వేసుకోనివారికి అవగాహన కల్పించి ఇంటి వద్దనే వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, శ్రీనివాస్ ,రాజ్‌కుమార్ ,అంగన్వాడీ టీచర్లు ఉన్నారు .