
బెజ్జంకి, అక్టోబర్ 28 : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు బెజ్జంకి క్రాసింగ్, గుగ్గిళ్ల, రేగులపల్లి, చీలాపూర్, పెరుకబండ, గుండారం, కల్లెపల్లి, బేగంపేట, లక్ష్మీపూర్, దాచారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన చివరి గింజా వరకు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, కొనుగోలు కేం ద్రాల్లో విక్రయించాలని సూచించారు. పలు గ్రామాల్లో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బెజ్జంకిలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో హమాలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మ ల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎం పీఎం నర్సయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.