
మర్కూక్, అక్టోబర్ 28 : వ్యవసాయ రంగంలో మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని విత్తనోత్పత్తి పంటలపై రైతులు మొగ్గు చూపాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి రామలక్ష్మి అన్నారు. గురువారం సీఎం దత్తత గ్రామాలు నర్సన్నపేట,ఎర్రవల్లిలో పైలెట్ ప్రాజెక్టు కింద బిందు సేధ్యంలో సాగుచేసిన పొలాలను సర్పంచ్ భాగ్యబిక్షపతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యాసంగిలో వరికి బదులు డ్రిప్ కింద ఆరుతడి పంటలు వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, తీపి మొక్కజొన్నను నల్లరేగడి నేలలో శనగ సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఒక ఎకరం వరి సాగు చేయు నీటితో 4 ఎకరాల ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చునని తెలిపారు. వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు అవసరమైన నీరు, విద్యుత్, పెట్టుబడులు తక్కువగా ఉంటుందన్నారు. పంట మార్పిడితో భూసారం పెరుగుతుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి, నెటాఫిన్ ప్రతినిధి సుబ్బారావు, వెంకట్రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం అంటే ఇష్టం..
నేను అమెరికాలో ఉన్నా నా మనసంతా మాగ్రామం, కుటుంబం, వ్యవసాయంపై ఆలోచన ఉండేది. అందుకే కేవలం అమెరికాలో రెండేండ్లే ఉద్యోగం చేసి తిరిగి వచ్చా. వచ్చిన తరువాత కుటుంబంతో ఉంటూ జాలపల్లి దగ్గర వ్యవసాయం చేస్తున్నారు. ఏడాది పొడవునా పలు రకాల పంటలు పండిస్తున్నా. వ్యవసాయం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. వరి, మొక్కజొన్న పంటల కంటే కూరగాయలు పండించడం, తోటల సాగంటే నాకు ఇష్టం.ఎందుకంటే వరి పండించే రైతులు చాలా మంది ఉన్నారు. కానీ, తోటల సాగు, కూరగాయలు పండించే వారు తగ్గుతున్నారు.
మాకు ఉపాధి దొరుకుతున్నది..
దుష్యంత్ సార్ ఇక్కడ వ్యవసాయం చేస్తుండడంతో మా గ్రామంలో చాలా మందికి పని దొరుకుతున్నది. మా పొలాల్లో పనిలేనప్పుడు కూడా ఇక్కడ ఏడాది పొడువునా పని లభిస్తున్నది.
-లంబ ఓజవ్వ, రోజువారి కూలీ,
జాలపల్లి (సిద్దిపేట జిల్లా)