చర్లపల్లి, నవంబర్ 12: కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, రాములు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఏర్పడుతున్న ఇబ్బందులను సీసీఎస్ ప్రతినిధులు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి శుక్రవారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. వారం రోజులపాటు బారికేడ్లను ఏర్పాటు చేసి, సమస్యలు వస్తే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు రవికుమార్, వెంకటయ్య, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, ఆశోక్, దామోదర్‌రెడ్డి, యావపురం రవి పాల్గొన్నారు.