మేడ్చల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తూ.. వైద్య సేవలను అందిస్తున్నట్లు మేడ్చల్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. కరోనా నియంత్రణపై మంత్రి హరీశ్‌రావు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో కరోనా కేసులతో పాటు ఫీవర్ సర్వేను నిర్వహించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీసీలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, వైద్యాధికారి మల్లికార్జునరావు పాల్గొన్నారు.