హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆరోగ్యశాఖ నీట్ కటాఫ్ మారులను తగ్గించిన నేపథ్యంలో ఎండీఎస్ సీట్లను భర్తీ చేసేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి పీజీ కటాఫ్ సోరును 23.029 పర్సెంటైల్ తగ్గించినందున అభ్యర్థులు ఎండీఎస్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నది. కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 15లోగా, యాజమాన్య కోటా సీట్లకు 16 నుంచి 18లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం www. knruhs.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది.