హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఫలానా కోర్సులో చేరితే ఫలా నా ఉద్యోగం, మంచి జీతంతో మంచి ప్లేస్‌మెంట్స్ లభిస్తుందని ఆశిస్తాం. అలాంటి కోర్సుల్లో ఎంబీఏ అగ్రస్థానంలో, ఆ తర్వా త ఇంజినీరింగ్ రెండోస్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఎంబీఏ గ్రాడ్యుయేట్లు 78%మంది ఉద్యోగాలు పొందుతూ టాప్ లో ఉన్నారు. ఈ మేరకు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ -2025 వెల్లడించింది. 2025లో కొత్త నియామకాలు 11 శాతం పెరుగుతాయని నివేదిక అం చనావేసింది. నిరుడు రిక్రూట్మెంట్స్ పెరుగుల 25% పెరిగిందని స్పష్టంచేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ట్యాక్సేషన్, ఎఫ్‌డీఐ వంటి రంగాల్లో పరిశోధన చేసేందుకు ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండి యా’ (ఐసీఏఐ) హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీవోఈ) ఏర్పాటు చేసిం ది. డాక్టర్ నూపుర్ పవన్ బంగ్ను ఈ సెంటర్‌కు డైరెక్టర్ కమ్ డీన్‌గా నియమించింది. ఈ రీసెర్చ్ సెంటర్లో ట్యాక్సేషన్, ప్రాంతీ య, గ్రామీణ ఆర్థికాభివృద్ధి, ఎఫ్‌డీఐ, ఆదా యం, పొదుపు ట్రెండ్స్, విదేశీ పాలసీ లు, ప్రభుత్వ పాలసీలు, జీఎస్టీ, ఎంప్లాయ్మెంట్, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి వంటి అంశాలపై రీసెర్చ్ చేస్తారు.