హైదరాబాద్, సెప్టెంబర్ 26 : ప్రముఖ పరుపుల విక్రయ సంస్థ సెంచూరీ మ్యాట్రస్ తాజాగా సోఫా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. సోఫాల తయారీకోసం హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పినట్టు సెంచూరీ మ్యాట్రస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలాని తెలిపారు. వచ్చే మూడేండ్లలో సోఫా మార్కెట్లో 20 శాతం మార్కెట్ వాటాను సాధించే అవకాశం ఉందన్న ఆయన..
ప్రస్తుతం 50 వేల కోట్ల స్థాయిలో ఉన్న సోఫా వ్యాపారం సంఘటిత రంగం వాటా కేవలం 10 శాత మేనని, మిగతా 90 శాతం అసంఘటిత రంగానిదన్నారు. పరుపులు, సోఫాలను విక్రయించడానికి హైదరాబాద్‌లో నాలుగో ఎక్స్‌క్లూజివ్ సెంటర్‌ను ప్రారంభించినట్టు, తద్వారా కస్టమర్లకు మరింత చేరువకావడానికి వీలుపడుతుందన్నారు.