చెన్నై, అక్టోబర్ 24: అగ్గిపెట్టె ఖరీదు డబుల్ కానున్నది. ఇప్పటివరకు ఒక్క రూపాయి ఉన్న అగ్గిపెట్టె డిసెంబర్ నుంచి రెండు రూపాయలు కానున్నది. ఉత్పత్తి వ్యయంతోపాటు ముడిసరకు వ్యయం కూడా భారీగా పెరుగడంతో అగ్గిపెట్టె రేటు పెంచకతప్పలేదని జాతీయ చిన్న అగ్గిపెట్టెల తయారీదారుల సంఘం కార్యదర్శి వీఎస్ సేతురథినం ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం అగ్గిపెట్టెలో 36 పుల్లలు ఉంటాయని, రెండు రూపాయల అగ్గిపెట్టెలో 50 అగ్గిపుల్లలు ఉంటాయని తెలిపారు. 14 ఏండ్ల తర్వాత అగ్గిపెట్టె రేటు పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి ఐదు లక్షల మంది జీవిస్తున్నారని, ఇందులో ప్రధానంగా మహిళలే పనిచేస్తున్నారని తెలిపారు.