నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నకిరేకల్ మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన 50 కుటుంబాలు (వడ్డెర కులస్తులు) ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో కుంచం వెంకన్న, సంపంగి సురేష్, రుపాని రాంబాబు, వరికుప్పల వెంకన్న, కొడిదల శివ శంకర్, గోగుల గురుస్వామి, కొడిదల్ బుచ్చయ్య, కొర్రల వీరబాబు, వరికుప్పల ఇద్దయ్య, ఆలకుంట్ల రమేష్, గోసు పెద్ద నరసింహ తదితరులు ఉన్నారు. అనంతరం చెనగాని, తండు వారి ఎల్లమ్మ పండుగకు హాజరై పూజలు నిర్వహించారు.
ఎల్లమ్మ పండుగకు హాజరైన ఎమ్మెల్యే