Mass shooting : ఆస్ట్రేలియా (Australia) లో ఘోరం జరిగింది. పర్యాటకులే లక్ష్యంగా ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది పర్యాటకులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు దుండగులపై కాల్పులు జరపడంతో ఒకడు హతమయ్యాడు. మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సిడ్నీ నగరం (Sydney city) లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండీ బీచ్ (Bondi beach) లో ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం) ఈ కాల్పులు జరిగాయి.
ఆదివారం సాయంత్రం పర్యాటకులంతా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించారు. పర్యాటకులే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. దాంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. పది మంది తూటాలు తగిలి ప్రాణాలు విడిచారు. నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్‌గన్స్‌తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షుల చెబుతున్నారు.
బాండీ బీచ్‌లో జరుగుతున్న ఒక ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకొని దుండగులు దాడి చేశారు. కాల్పుల్లో 10 మంది మృతి చెందినట్లు ఆస్ట్రేలియా పత్రికలు పేర్కొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు దుండగులపై కాల్పులు జరపగా ఒకడు మరణించినట్లు తెలిపాయి. మరొకడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. కాల్పుల్లో గాయపడిన వారిని కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొన్నాయని చెప్పారు.
I am simply horrified to have been sent footage of a shooting at a Hanukkah celebration at Bondi Beach in Sydney, Australia.
My thoughts and prayers are with the Jewish community in Australia at this awful moment. I sincerely hope that my friends are safe, and I am praying for… pic.twitter.com/gTx254iQ5z
— Sharren Haskel השכל שרן (@SharrenHaskel) December 14, 2025